రేనాటి చంద్రునిగా ప్రసిద్ధిగాంచిన బుడ్డా వెంగళరెడ్డి జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. సలీంబాషా అన్నారు. బుధవారం కళాశాలలో బుడ్డా జీవితంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. 1866లో సంభవించిన భయంకరమైన కరువులో తిండికి లేక వేలాది మంది ఆకలి చావులకు గురైన విషయాన్ని ఆయన విద్యార్థులకు గుర్తు చేశారు.