CTR: రామకుప్పం మండలం పీఎంకే తండాలో మంగళవారం అర్థరాత్రి రెండు ఏనుగులు పొలాల్లోకి చొరబడి రైతు చంద్ర నాయక్ సహా పలువురి వరి పంటలను ధ్వంసం చేశాయి. అయితే ఒక్క రాత్రిలోనే నెలల శ్రమ వృథా కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దాడులు ఆగకపోవడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.