KMR: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ శారదా మాత ఆలయంలో బుధవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో జిల్లా కేంద్రానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సతీష్ పాండే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. పౌర్ణమి రోజున అమ్మవారికి కుంకుమార్చన చేస్తే శుభప్రదమని తెలిపారు.