KKD: కార్తీక పౌర్ణమి సందర్భంగా కరప మండలంలోని ఉప్పలంక, రూరల్ సూర్యారావుపేట, నేమం, ఎన్టీఆర్ బీచ్ వద్ద మెరైన్ పోలీసులు పహారా కాశారు. సీఐ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 3 గంటల నుంచి సిబ్బంది పర్యవేక్షణ చేశారు. పవిత్ర స్నానాలకు వచ్చే భక్తులు సముద్రం లోపలికి వెళ్లకుండా గజ ఈతగాళ్లతో కలిపి పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించారు. దీంతో పోలీసులను భక్తులు అభినందించారు.