అనకాపల్లి: కోటవురట్ల మండల అల్లుమియాపాలెం గిరిజన గ్రామంలో రేషన్ సబ్ డిపో ప్రారంభమైంది. ఇప్పటివరకు గ్రామస్తులు రేషన్ కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో గల రామచంద్రపురం వెళ్లి తీసుకునేవారు. దీని వల్ల గ్రామస్తులు పలు ఇబ్బందులు పడేవారు. గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించి అధికారులు రేషన్ సబ్ డిపోను ఏర్పాటు చేశారు. ఇకపై ఇక్కడి నుంచే రేషన్ తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు.