ప్రకాశం: టంగుటూరు మండలం కందులూరు గ్రామాన్ని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు సందర్శించారు. గ్రామంలో పరిశుభ్రత నీటి సరఫరా వ్యర్ధాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామ కాలవల్లో చెత్త పేరుకుపోకుండా తరచుగా శుభ్రం చేయాలని సూచించారు. ఎస్డబ్ల్యూసీసీ షెడ్లను మరమ్మత్ చేసి తడి చెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేయాలని చెప్పారు.