WGL: భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ‘కొబ్బరి నీళ్లు అమ్మబడవు’ అని సూచిస్తూ అధికారులు బుధవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొబ్బరి నీళ్లు విక్రయించడంపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఫిర్యాదు చేయడంతో ఈవో సునీత స్పందించారు. ఈవో విచారణలో కొబ్బరిముక్కలు పోగు చేసుకునే టెండర్ పొందిన వ్యక్తి అనధికారికంగా కొబ్బరి నీళ్లు విక్రయిస్తున్నట్లు తేలింది. అతనికి రూ.15 వేల జరిమానా విధించారు.