MHBD: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తొర్రూరు మండల కేంద్రంలోని పాటిమీది శివాలయం భక్తులతో కిటికీటలాడింది. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తుల పేరుతో అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.