MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ వివిధ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు గొడవలు పడవద్దని సూచించారు. శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, BRS, BJP, సీపీఎం, టీడీపీ, సీపీఐ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.