CTR: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు బూరగమంద, చెరుకువారిపల్లి, సదుం పాఠశాలలను మంగళవారం ఆయన పరిశీలించి, ఉపాధ్యాయుల సమస్యలను ఆరా తీశారు. అనంతరం బోధ నేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు.