KMR: పిట్లం మండలంలో జాతీయ రహదారిపై రైతులు పంటలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై వెంకట్రావు, హైవే అధికారులు రైతులకు రోడ్లపై పంటలు ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.