MDK: యువత జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్లో జిల్లా యువజన ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బట్టీ చదువులకు స్వస్తి చెప్పి విశ్లేషణాత్మకంగా చదవాలన్నారు. మహిళా క్రికెటర్లు విజయం సాధించి 140 కోట్ల మంది భారతీయుల అభిమానాన్ని చూరగొన్నారని గుర్తు చేశారు.