TG: వికారాబాద్ జిల్లా తాండూరులో మరో బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.