KMR: పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఉమాకాంత్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. జిల్లా ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెడ్లను, ఇంజెక్షన్లు, మోతాదుకు మించి మందులు ఇస్తున్నట్లు తెలిపారు.