NLR: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్ర తీర ప్రాంతానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మండల ఎంపీడీవో నాగేంద్రబాబు, రెవెన్యూ సిబ్బంది ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించారు. అయితే బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి స్నానం చేయుటకు కొంత పరిమితమైన ఏరియాను నిర్దేశించారు. అలాగే గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.