HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మద్దతుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.