AP: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సైకాలజీ విభాగంలో జూనియర్స్పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, సీనియర్లకు HOD విశ్వనాథ్ రెడ్డి మద్ధతిచ్చారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్పీ PGRSలో ఫిర్యాదు చేసినట్లు జూనియర్లు తెలిపారు. అలాగే, విశ్వనాథ్ రెడ్డిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.