E.G: అమలాపురం ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవలను బలోపేతం చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వైద్యాధికారులను హెచ్చరించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్వహణ పట్ల ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.