కడప జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, డాబాలపై పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టి యాజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. లాడ్జి నిర్వాహకులు రికార్డును పక్కగా మెయింటెన్ చేయాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు.