NRML: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టాలని దిలావర్పూర్ ఎంపీఓ గోవర్ధన్, ఏఈ సానా ఫాతిమా లు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో లబ్ధిదారుల వద్దకు వెళ్ళి నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా వారికి పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పరిశీలించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి కారోబారి, తదితరులున్నారు