KKD: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గల డైట్లో డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 3 వరకు పెంచినట్లు జిల్లా డీఈవో పిల్లి రమేష్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లుగా కనీసం అయిదేళ్ల అనుభవం, 58 ఏళ్ల లోపు వయస్సు కలిగిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల ద్వారా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.