NTR: వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు పేకాట శిబిరంపై దాడి నిర్వహించి, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.