AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి.. 9 మంది మృతిచెందారు. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతోపాటు పక్క జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. కానీ, నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రేలింగ్ కూలడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.