అన్నమయ్య: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాజంపేట పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పోలీ శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం రాజంపేట మండలంలోని పోలీ గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.