NTR: మైలవరం పట్టణంలో రెండు చౌక ధరల దుకాణాలను స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు 5నెంబరు దుకాణం తమ్మిశెట్టి రజనికి ,43వ దుకాణాన్ని పాకలపాటి పార్వతికి ప్రభుత్వం కేటాయించింది. ప్రజలకు సక్రమంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే వారిని ఆదేశించారు.