రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన ఓ పత్రిక రిపోర్టర్ కడుమూరి రాములు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాములు మృతి పట్ల పాత్రికేయులు, స్థానిక నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.