W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో ‘మొంథా’ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ప్రజలకు అంటూ వ్యాధులు వ్యాపించకుండా గ్రామ సర్పంచ్ అడ్డాల సూరిబాబు ఆధ్వర్యంలో గ్రామంలో స్పెషల్ శానిటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎంపీటీసీ తిరుమాని స్వామి, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి ఎం. సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.