Child Stuck In Dust Devil: డస్ట్ డెవిల్ లో చిక్కుకున్న చిన్నారిని రక్షించిన ఎంపైర్
తీవ్రమైన సుడిగాలి(dust devil)లో చిన్నారి చిక్కుకోగా తక్షణమే ఎంపైర్(umpire saves) రక్షించారు. కొన్ని క్షణాలే సుడిగాలిలో ఉన్నా 10నిమిషాలు ఉన్నట్లు అనిపించిందని చిన్నారి తెలిపింది.
సుడి గాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. దుమ్ము దుమారం(dust devil )రేపుకుంటూ గాలి సుడులు తిరుగుతూ అత్యంత శక్తివంతగా ముందుకు కదులుతుంటుంది. మన భారత దేశంలో ఈ సుడిగాలుల తీవ్రత అంత తీవ్రంగా ఉండదుకానీ.. విదేశాలలో ఈ సుడిగాలుల తీవ్రత అధికం వాటినే అక్కడ టోర్నడోలు అని అంటారు. విదేశాలలో చెక్కతో ఇళ్లను కట్టుకుంటారు కాబట్టి టోర్నడోలు వచ్చినప్పుడు ఇళ్ల కప్పులను అమాంతం లేపుకు వెళ్తాయి. వీటిని డస్ట్ డెవిల్ అని కూడా పిలుచుకుంటారు. సుడులు తిరిగే ఆ గాలిలో దుమ్ము దూళి కూడా చేరడంతో దానికి ఆపేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆదివారం ఫ్లోరిడాలో యూత్ బేస్ బాల్ గేమ్ జరుగుతుండగా.. ఇంటి ప్లేట్‌పై డస్ట్ డెవిల్ ఏర్పడింది. అందులో 7 ఏళ్ళ జోయా అనే చిన్నారి చిక్కుకుంది. ఆ సుడిగాలిలోనుంచి బయటకు రాలేకపోయింది. ఇంతలోనే ఆ మ్యాచ్ కు ఎంపైర్ గా వ్యవహరిస్తున్న 17 ఏళ్ల ఐడాన్ వైల్స్ అనే వ్యక్తి చిన్నారిని రక్షించాడు. డస్ట్ డెవిల్ లో నుంచి బయటకు తీసుకవచ్చాడు. ఈ సంఘటన జాక్సన్‌విల్లేలోని ఫోర్ట్ కరోలిన్ అథ్లెటిక్ అసోసియేషన్ బేస్ బాల్ మైదానంలో జరిగింది.
ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అయింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మీడియాతో మాట్లాడిన చిన్నారి.. తాను డస్ట్ డెవిల్ లో చిక్కుకున్నప్పుడు చాలా బయపడినట్లు తెలిపింది. బయటకు లాగుతారని ఆశించినట్లు చెప్పింది. అనుకున్నట్లుగానే తమ ఎంపైర్ బయటకు లాగినట్లు తెలిపింది. తాను కేవలం 10 సెకన్లు మాత్రమే అందులో ఉన్నానని కానీ 10నిమిషాలు ఉన్నట్లు అనిపించిందని ఇది బయానకగుర్తుగా తన జీవితంలో గుర్తుండిపోతుందని తెలిపింది.