ATP: ఉపాధి కోసం సౌదీ వెళ్లి చిక్కుకుపోయిన నిజాంను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంత ఖర్చులతో అనంతపురం రప్పించారు. అక్కడి వేధింపులపై నిజాం సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే స్పందించి, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. లోకేశ్ వెంటనే స్పందించి స్వేదేశానికి వచ్చేలా చర్యలు చేపట్టారు. నిజాం గురువారం సౌదీ నుంచి అనంతపురం చేరుకున్నారు.