AP: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో చిక్కుకున్న బోట్లను అధికారులు వెలికితీశారు. ఇసుక తవ్వకాల కోసం తెప్పించి రెండురోజుల క్రితం తాడుతో బోట్లను కట్టేశారు. నది ప్రవాహం పెరిగడంతో తాళ్లు తెగి మూడు బోట్లు కొట్టుకుపోయాయి. బుధవారం రెండు పడవలను గట్టుకు తరలించగా.. ఈరోజు భారీ బోటును బయటకు తీశారు. ఆ పడవ అలాగే కిందకు వెళ్తే పెన్నా వారధి గేట్లకు ఢీకొని భారీ నష్టం వాటిల్లేదని తెలిపారు.