ATP: ‘మొంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. మంగళ, బుధవారాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఉరవకొండలో 52 మి.మీ, బెళుగుప్పలో 38.5, రాయదుర్గంలో 30.75 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు.