NLG: చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన BRS నాయకులు సాగర్ల భిక్షం ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. జాల గోపాల్, మాధగోని నాగయ్య, జాల మల్లేష్, మాధగోని లింగయ్య తదితరులు చేరిన వారిలో ఉన్నారు.