కోనసీమ: కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఏ ఒక్కరూ సముద్ర స్నానానికి వెళ్లరాదని అల్లవరం ఎస్సై సంపత్ కుమార్ సూచించారు. మొంథా తుపాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఓడలరేవులో సముద్ర స్నానానికి ఏ ఒక్కరూ వెళ్లకుండా తమకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.