Pawan Kalyan:పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వర్సెస్ సీఎం జగన్ మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. పవన్ నిన్న చేసిన కామెంట్స్‌పై సీఎం జగన్ ఈ రోజు రియాక్ట్ అయ్యారు. పవన్‌ను ప్యాకేజీ స్టార్ అనగా.. మరోసారి పవన్ రియాక్ట్ అయ్యారు. వైసీపీ, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో మాట్లాడారు. జనసైనికుల ఎల్ఐసీ పాలసీ కోసం రూ.కోటి ఖర్చు చేస్తున్నానని వివరించారు. నినాదాలతో సీఎం అవలేమని.. ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని చెప్పారు.
గత ఎన్నికల్లో కాపులు వైసీపీకి పట్టం కట్టారని పవన్ (Pawan Kalyan) గుర్తుచేశారు. 60 శాతం కాపులు వైసీపీకి ఓటు వేశారని పవన్ కల్యాణ్ అన్నారు. చివరకు కాపులకు ఏం చేయం అని తిడతారని గుర్తుచేశారు. ఎస్సీలను తిట్టి.. అట్రాసిటీ కేసులు పెడతారని పేర్కొన్నారు. వైసీపీకి జనసేన అంటే భయం పట్టుకుందని చెప్పారు.
ఇకనైనా మారాల్సింది ప్రజలు అని.. నేతలు కాదన్నారు. తన భీమ్లా నాయక్ సినిమాను ఆపేస్తే రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని పవన్ (Pawan Kalyan) గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలు మాత్రం.. వేలకు వేల కోట్లు, కాంట్రాక్టులతో సంపాదిస్తున్నారు. ఇసుక దోపిడీ చేస్తోన్న.. జనం వారి వెంట ఉంటున్నారని వివరించారు.
తాను నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. షూటింగ్ చేస్తే తనకు రోజుకు 2,3 కోట్ల సంపద వస్తుందని చెప్పారు. తనను ఎవరూ మోసం చేయడం లేదని.. తానేం పిల్లాడిని కాదన్నారు. గడ్డం తెల్లబడలేదా.. మీసాలు రాలేదా అన్నారు.
చంద్రబాబు సతీమణీ భువనేశ్వరి గురించి నీచంగా మాట్లాడితే స్పందించానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తినే అలా మాట్లాడుతుంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని అడిగారు. రాజకీయాల్లో విలువలు ఉంటాయని పేర్కొన్నారు. తప్పు చేస్తే నిలబడి మాట్లాడతానని చెప్పారు. గుండె ధైర్యం లేని వాడు రాజకీయాల్లోకి రావొద్దని.. తనకు దమ్ము ఉంది.. నిలదీసి మాట్లాడతానని తెలిపారు.
నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని.. జనసేన ప్రభుత్వం ఏర్పాటు సాధ్యసాధ్యాలు గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి 7 శాతం ఓటు శాతం వచ్చిందని వివరించారు. రూపాయి పెట్టుబడి లేకుండా ఇదీ సాధ్యమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అదీ 14 శాతం నుంచి 18 శాతం వరకు ఉంటుందని తెలిపారు. కృష్ణ- శ్రీకాకుళం వరకు 20 శాతం ఓట్లు.. ఉభయ గోదావరి జిల్లాలో 34 శాతం ఓట్లు పడతాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం చేయలేమని.. కానీ ఎన్నికల్లో పోటీ చేసే బలం ఉందన్నారు.
పార్టీ నిర్మాణం కష్టమైన పని అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఓ కులానికి ప్రాతినిధ్యం వహించేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తనను ఓ కులానికి పరిమితం చేయొద్దని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులు, తమిళనాడులో కూడా తనకు అభిమానులు ఉన్నారని వివరించారు. బెంగాల్ కూడా రమ్మంటున్నారని చెప్పారు. అజాత శత్రువు అయ్యేందుకు రాజకీయాల్లోకి రాలేనని చెప్పారు. కష్టాలు ఉన్నప్పుడు పవన్ గుర్తొస్తాడు.. ఎన్నికల సమయంలో మరచిపోతారని పవన్ కల్యాణ్ అన్నారు. ఓట్టు వేయకుండా మీరు ఎలా మాట్లాడతారని అడిగారు. ఇంత జనాధరణ ఉండి.. పట్టుమని 10 సీట్లు రాకుంటే ఎలా అని అన్నారు.