AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగిస్తున్న సమయంలో క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం అతడిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.