»23 Year Old Kerala Doctor Stabbed To Death By Man She Was Treating
Kerala Doctor : కేరళలో వైద్యం చేస్తుండగా డాక్టర్ ను పొడిచిన పేషెంట్
కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ దుండగుడు కత్తెరతో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్ వచ్చింది.
Kerala Doctor : కేరళ రాష్ట్రం(Kerala State)లో ప్రభుత్వ డాక్టర్(Doctor) దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని పోలీసులు(police) ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ దుండగుడు కత్తెర(scissors)తో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర(Kottarakkara) ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్ వచ్చింది. సమాచారం అందగానే పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. కుటుంబ గొడవలో సందీప్(Sandeep) అనే వ్యక్తికి కాలికి గాయమైంది. సందీప్‌ను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విధుల్లో ఉన్న డాక్టర్ వందనా దాస్(23), అతడి కాలి గాయానికి కట్టు వేయసాగింది. అయితే సందీప్ ఉన్నట్టుండి ఆ వైద్యురాలిపై కత్తెర, సర్జరీ బ్లేడ్‌తో దాడి చేశాడు. దీంతో కాపాడాలని అరుస్తూ డాక్టర్ గది నుంచి ఆమె బయటకు పరుగులు తీసింది. వెంబడించిన సందీప్, డాక్టర్ వందనాను కత్తెరతో పొడిచాడు.
డాక్టర్ గది బయట ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ సందీప్‌ను నిలువరించలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కష్టం మీద అతడ్ని పోలీసులు అదుపులోకి(Arrest) తీసుకున్నారు. స్కూల్ టీచర్ అయిన సందీప్ సస్పెన్షన్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యురాలిపై దాడి సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డాక్టర్ వందనాపై సందీప్ ఎందుకు దాడి చేశాడో తెలియదని పోలీసులు అంటున్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన డాక్టర్ వందనాను తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన కేరళలో కలకలం రేపింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ దాడిని ఖండించడంతోపాటు నిరసనకు పిలుపునిచ్చింది. కేరళ సీఎం విజయన్ కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షాకింగ్తోపాటు చాలా బాధాకరమని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.