సినిమా అవకాశాలు బాగా రావడంతో కోలీవుడ్ లో అనికా రామచంద్రన్ బిజీ అయిపోయింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్(Poster Viral) అవుతున్నాయి.
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాతో అనికా సురేంద్రన్(Anika Ramachandran) చైల్డ్ ఆర్టిస్టుగా తెరపై ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె హీరోయిన్ గా మారారు. అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమాతో కూడా అనికా సురేందర్ నటించారు. ఇటీవలె ఆమె బుట్టబొమ్మ సినిమా(Buttabomma movie)తో అటు తెలుగులో ఇటు కోలీవుడ్లోనూ హీరోయిన్ గా చేశారు. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అవకాశాలు బాగా రావడంతో కోలీవుడ్ లో అనికా బిజీ అయిపోయింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్(Poster Viral) అవుతున్నాయి.
ఓ వైపు తన ఫిల్మ్ కెరీర్లో అవకాశాలు వస్తూ బిజీ అవుతున్న తరుణంలో నెట్టింట ఆమె పోస్టర్లు వైరల్(Poster Viral) అవుతున్నాయి. సోషల్ మీడియా హ్యండిల్లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు అనికా రామచంద్రన్(Anika Ramachandran) ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తన డ్యాన్స్ రీల్స్ అండ్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఈ బ్యూటీపై తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ హల్ చల్ చేస్తోంది. అనికా చనిపోయిందంటూ కొన్ని పోస్టర్స్ నెట్టింట వైరల్ అవ్వడం అందరికీ షాకిస్తోంది. అయితే ఓ సినిమా కోసమే ఈ పోస్టర్ చేసినట్లు తెలియడంతో కాస్త కూల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.