వేసవి(Summer)లో సినిమా సందడి ప్రారంభమైంది. ఈసారి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లకు రాలేదు. అయితే చిన్న హీరోలు థియేటర్లలో సందడి చేశారని చెప్పాలి. గత వారం థియేటర్లకు ఉగ్రం(Ugram), ది కేరళ స్టోరీ(The Kerala Story)లు వచ్చి విజయాలను సాధించాయి. ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ఈ వారం విడుదలయ్యే ఈ సినిమాలేంటో (Releasing Movies) ఇప్పుడు చూద్దాం.
అక్కినేని హీరో నాగచైతన్య(Naga chaitanya), కృతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా కస్టడీ(Custody Movie). వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళంలో మే 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది. అందాల తార శ్రియ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా మ్యూజిక్ స్కూల్(Music School). ఇది కూడా 12న విడుదల కానుంది. హీరో సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam) మే 12న రిలీజ్ అవుతోంది. ఇవే కాకుండా ‘కళ్యాణమస్తు’, ‘ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్’ వంటి చిన్న సినిమాలు కూడా మే 12న విడుదల కానున్నాయి.
ఇకపోతే హిందీలో టాలీవుడ్(Tollywood) హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా ఛత్రపతి(Chatrapati). వివి వినాయక్ హిందీలో రీమేక్ చేసిన ఈ మూవీ మే 12న విడుదల కానుంది. తెలుగు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి హిందీలో తీస్తున్న సినిమా IB71. ఈ మూవీ బాలీవుడ్లో మే 12న విడుదల కానుంది. ఈ మూవీస్తో పాటుగా హిందీలో జోగిరా సారా రారా, రోస్ వంటి సినిమాలు మే12న విడుదల కానున్నాయి.
తమిళంలో ఐశ్వర్య రాజేష్(Iswarya Rajesh) ముఖ్య పాత్రలో చేసిన సినిమా ఫర్హానా(Farhana). ఈ మూవీ తమిళంతో పాటుగా పాన్ ఇండియా వైడ్గా మే 12న విడుదల కానుంది. ఇదే కాకుండా తమిళంలో గుడ్ నైట్, పిజ్జా 3, రావణ కొట్టం, సిరువాం శ్యామ్యూల్ వంటి సినిమాలు మే 12వ తేదిన థియేటర్లలో విడుదల(Release) కానున్నాయి.