KMR: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 481 మంది రైతుల నుంచి 21,006 బస్తాల పంటను కొనుగోలు చేసినట్లు సొసైటీ అధికారులు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను అమ్మకానికి తెచ్చే ముందు అందులో మట్టి శాతం 2 శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.