NLR: కల్తీ మద్యానికి వ్యతిరేకంగా కోవూరు పట్టణంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి వైసీపీ మహిళ విభాగం నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లే కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కల్తీ మద్యం నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.