MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో రోజురోజుకీ అడవి పందుల బెడద తీవ్రమౌతుంది. గ్రామానికి చెందిన కాట్రియాల జీవన్ రాజ్ అనే రైతు పొలంలో గత రాత్రి అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి వరి పంటను నాశనం చేశాయి. ఇప్పటికే వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోయానని, ఇప్పుడు అడవి పందుల ద్వారా పూర్తిగా నష్టపోయానని అధికారులు తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.