SRD: పటాన్ చెరు పోలీస్టేషన్ పరిధిలో ముదిరాజ్ బస్తీకి చెందిన సబావత్ పింకి బాయి (23) అనే యువతి అదృశ్యమైంది. డిగ్రీ పూర్తి చేసిన పింకి బాయి ఆదివారం కిరాణా షాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు సబావత్ వాసుదేవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.