WGL: బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ హక్కుల సాధన సమితి నల్లబెల్లి మండల నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42% అమలు చేయాలన్నారు.