KNR: చొప్పదండిలో కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటలకు ఫెన్సింగ్ వేసి మత్స్యకారులకు ఉపాధి భద్రత కల్పించాలని తెలంగాణ మత్స్యకారుల సంఘం నాయకులు బాలకృష్ణ, కనకయ్య ఆదివారం డిమాండ్ చేశారు. అనంతరం కరీంనగర్లోని నవంబర్ 25, 26, 27 తేదీల్లో జరిగే 4వ రాష్ట్ర మత్స్యకారుల మహాసభల పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శేఖర్ పాల్గొన్నారు.