SKLM: కవిటి మండలం మాణిక్యపురం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి సుమారు 11 మందిపై దాడి చేసి గాయపరిచాయని స్థానికులు తెలిపారు. ఆదివారం శృంగారపు నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద దాడి చేసి గాయపరిచాయి. గాయపడిన పలువురు సోంపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.