ATP: గుత్తి పట్టణ కేంద్రంలో బాణాసంచా విక్రయాలకు జిల్లా కలెక్టర్, స్థానిక తహసిల్దార్, అగ్నిమాపక శాఖ నుంచి తాత్కాలిక లైసెన్స్ లు తప్పనిసరిగా పొందాలని గుత్తి సీఐ రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా బాణాసంచా షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పనిసరిగా బాణాసంచా విక్రయాలకు అనుమతి తీసుకోవాలన్నారు.