KMM: ఖమ్మం వీడీవోస్ కాలనీలో జరిగిన ఘటనపై రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సీపీని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి వెల్లడించారు. కుటుంబ, వ్యక్తిగత తగాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.