ADB: భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్ష నిర్వహించి మందులను అందజేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలు, శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు.