ప్రకాశం: సంతనూతలపాడులో వంతెనకు ఏర్పడిన గుంతను పూడ్చేందుకు 20 రోజులు గడిచినా ఆర్ & బి అధికారులు స్పందించకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంత కారణంగా ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.