HYD: కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్‌కు సంబంధించి భారీ నీటి లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచర్ల ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.